Himachal Pradesh | నేడు హిమాచల్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం.. సీఎంపై రానున్న స్పష్టత!
Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పదవిని చేపట్టేదెవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం షిమ్లాలో
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పదవిని చేపట్టేదెవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం షిమ్లాలో సమావేశం కానుంది. నూతన ఎమ్మెల్యేలంతా పార్టీ ప్రధాన కార్యాలయమైన రాజీవ్ భవనక్ మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకోవాలని పీసీసీ ఆదేశించింది. ఈ సమావేశానికి పార్టీ ఎలక్షన్ సూపర్వైజర్ భూపేశ్ బఘేల్, రాష్ట్ర ఇన్చార్జీ రాజీవ్ శుక్ల, భుపేంద్ర సింగ్ హుడా కూడా హాజరుకానున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారని తెలుస్తున్నది.
అసెంబ్లీలోని 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను సొంతం చేసుకున్నది. మరో 25 చోట్ల బీజేపీ, మూడు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి మొదట్లో అంతా సాధారణ మెజార్టీకి అటూఇటుగా సీట్లు వస్తాయని భావించారు. దీంతో ఎలాంటి బేరసారాలకు తావులేకుండా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చండీఘడ్‌లో హోటల్‌ను కూడా సిద్ధం చేశారు.
కాగా, సీఎం పదివి రేసులో సుఖ్విందర్ సింగ్ సుఖు, ప్రతిభా సింగ్, ముకేశ్ అగ్నిహోత్రి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రతిభా సింగ్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

