Earthquake prediction | హిమాలయాలకు పొంచి ఉన్న భారీ ముప్పు.. సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలకు ఛాన్స్!
Earthquake prediction | తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి.
- భారత భూగర్భంలో ఏటా 5 సెం.మీ. కదులుతున్న టెక్టోనిక్ ప్లేట్లు
- హిమాలయాల వెంబడి పెరుగుతున్న ఒత్తిడి
- సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలకు చాన్స్
- ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్టు ఎన్ పూర్ణచంద్రరావు
Earthquake prediction | హైదరాబాద్: తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి. మన దేశంలో కూడా అప్పుడప్పుడు.. అక్కడక్కడా భూప్రకంపనలు చోటుచేసుకొంటుంటాయి. అయితే రిక్టర్ స్కేల్‌పై వాటి తీవ్రత తక్కువగా నమోదవుతుండటంతో పెద్దగా ప్రభావం ఉండటం లేదు. అయితే ఎప్పటికీ ఇలానే ఉంటుందని అనుకోవడానికి లేదని, భారత భూగర్భంలో చోటుచేసుకొంటున్న పలు మార్పుల కారణంగా భవిష్యత్తులో మన దేశంలో కూడా ప్రధానంగా హిమాలయాల సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత భూభాగ పైపొరల్లోని టెక్టోనిక్ ప్లేట్లు ప్రతి ఏడాది 5 సెంటీమీటర్ల మేర కదులుతున్నాయని, ఇది హిమాలయాల వెంబడి ఒత్తిడికి దారితీస్తున్నదని, తద్వారా రాబోవు రోజుల్లో హిమాలయ పర్వతాల సమీప ప్రాంతాల్లో భారీ భూకంప ఘటనలు సంభవించే ప్రమాదాన్ని పెంచుతున్నదని హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన చీఫ్ సైంటిస్టు, భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. భూఉపరితలం అనేక ప్లేట్లు కలిగి ఉంటుందని, అవి నిత్యం తిరుగుతూ ఉంటాయని తెలిపారు. హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉండే హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పశ్చిమ నేపాల్ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- high
- Himalayas
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

