నాలుగేండ్లుగా నిద్రపోయారా?
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌తోపాటు ఇతర అనుమతులు లేకుండా నగరంలో అలాంటి రెండు గేమింగ్ జోన్లు గత రెండేండ్లకు పైగా నడుస్తుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
- గుజరాత్ ప్రభుత్వంపై నమ్మకం లేదు
- రాజ్‌కోట్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం
- అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు
- గతంలో సూచనలు చేసినా మళ్లీ ప్రమాదాలు జరగడంపై తీవ్ర అసంతృప్తి
గాంధీనగర్, మే 27: గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌తోపాటు ఇతర అనుమతులు లేకుండా నగరంలో అలాంటి రెండు గేమింగ్ జోన్లు గత రెండేండ్లకు పైగా నడుస్తుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ విధమైన నిర్లక్ష్య వైఖరిపై రాజ్‌కోట్ మున్సిపాలిటీ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. గతంలో సూచనలు చేసినా, రాష్ట్రంలో ఇలాంటి పలు ఘటనలు కొనసాగాయని పేర్కొంటూ.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము విశ్వసించలేమని స్పష్టం చేసింది. ‘గత రెండున్నర ఏండ్లుగా ఇది నడుస్తున్నది(రాజ్‌కోట్ గేమింగ్ జోన్ కార్యకలాపాలకు సంబంధించి). మీకు కండ్లు కనిపించడం లేదని మేం అనుకోవాలా? మీరు, మీ అధికారులు ఏం చేస్తున్నారు?’ అని రాజ్‌కోట్ మున్సిపాలిటీని హైకోర్టు నిలదీసింది. ఫైర్ సేఫ్టీ ధ్రువీకరణ విచారణలు గత నాలుగేండ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పినప్పుడు.. న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ‘మీకు కండ్లు కనిపించడం లేదా? లేక నిద్రపోయారా? ఇప్పుడు స్థానిక వ్యవస్థతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేం విశ్వసించలేం’ అని పేర్కొన్నది.
సూచనలు చేసిన తర్వాతా ప్రమాదాలు..
గతంలో ఇలాంటి అనేక ఘటనలు జరిగిన విషయాన్ని గుజరాత్ హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. గత నాలుగేండ్లలో తాము అనేక నిర్ణయాలు వెలువరించామని, సూచనలు చేశామని, అయినా ఆ తర్వాత కూడా రాష్టంలో ఆరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయని రాష్ట్ర సర్కార్ తీరును ఎండగట్టింది. రాష్ట్ర అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రజలు చనిపోతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.
అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?
రాజ్‌కోట్ అగ్నిప్రమాదానికి కారణాలపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. వెల్డింగ్ వర్క్ సమయంలో ఎగిసిపడిన నిప్పురవ్వలు ప్లాస్టిక్‌పై పడటంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఓ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అయితే విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని మరోవైపు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంటలు చెలరేగి, ప్రవేశద్వారం సమీపంలోని తాత్కాలిక నిర్మాణం కూలిపోవడంతో లోపలున్న వారు బయటకు వెళ్లలేకపోయారని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

