IMD warning | ఆ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ
IMD warning | రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళ వారాల్లో అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో మాత్రం సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలవల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

