మహారాష్ట్రలో భారీ వర్షాలు
భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతున్నది. గురువారం ముంబైలో తెల్లవారు జామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. పలు ప్రాంతాల్లో 150 మి.మీ. పైగా వర్షం కురిసింది. ముంబైతో పాటు పుణె, థాణే, పాల్ఘార్ సహా పలు నగరాలను వరద ముంచెత్తింది. దీంతో ముంబైలోని స్కూళ్లు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.
- వరద ముంపులో ముంబై, పుణె
- విమాన సర్వీసులకు అంతరాయం
- విద్యాసంస్థలకు సెలవులు
- రెండు నగరాల్లోనూ రెడ్ అలర్ట్
ముంబై, జూలై 25: భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతున్నది. గురువారం ముంబైలో తెల్లవారు జామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. పలు ప్రాంతాల్లో 150 మి.మీ. పైగా వర్షం కురిసింది. ముంబైతో పాటు పుణె, థాణే, పాల్ఘార్ సహా పలు నగరాలను వరద ముంచెత్తింది. దీంతో ముంబైలోని స్కూళ్లు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. వీరిలో ముగ్గురు డెక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో మృతి చెందారు. పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో వరద పోటెత్తింది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. పుణెకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న లవాసా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలు, వరద కారణంగా ముంబై, పుణెలో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా పలు విమానాలు రద్దయ్యాయని, ఇంకొన్ని విమానాలను మళ్లించినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా, మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై, పుణెలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

