న్యూఢిల్లీ, అక్టోబర్ 19: నెల రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాబుల్ సుప్రియో.. మంగళవారం తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి ఈయన రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు.