HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకుకు చెందిన విశ్వసనీయ బిజినెస్ ప్లాన్లు, మార్కెట్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు ఆ ఇద్దరు చేరవేశారు.
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు(HDFC Bank)కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకుకు చెందిన విశ్వసనీయ బిజినెస్ ప్లాన్లు, మార్కెట్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు ఆ ఇద్దరు చేరవేసినట్లు విచారణలో వెల్లడైంది. బ్యాంకు సమాచారం లీకవుతున్నట్లు కొందరు బ్యాంకు నేతలు ఆరోపించడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్టులో పేర్కొన్నది. దర్యాప్తు సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించినట్లు విచారణాధికారులు తెలిపారు. అయితే ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేశారా లేదా అన్న కోణంలో బ్యాంకు అధికారులు చెకింగ్ చేస్తున్నారు.
సీనియర్ ప్రతినిధుల వ్యవహారంపై సీనియర్ మేనేజ్మెంట్, బోర్డు సభ్యులతో చర్చించారు. అయితే ఆ ప్రతినిధులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఇంకా తెలియదు. బ్యాంకులో అంతర్గత రివ్యూ జరుగుతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ప్రస్తుతం నాయకత్వ మార్పు జరగనున్నది. ఈ నేపథ్యంలో బ్యాంకులో స్క్రూట్నీ జరుగుతోంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలువ సుమారు 115 బిలియన్ల డాలర్లు ఉంటుంది. భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఇది. మూడు దశాబ్ధాలుగా ఈ బ్యాంకు నడుస్తోంది. ఈ ఏడాది హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 28 శాతం పడిపోయాయి. ఐసీఐసీఐ గ్రూపునకు చెందిన అనూప్ బాగ్చీ అక్టోబర్ 27వ తేదీన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈవో శశిధర్ జగదీశన్ తన పదవినీ వీడనున్నారు. హెచ్డీఎఫ్సీ డిప్యూటీ ఎండీ కైజాద్ బహరూచా కూడా డిసెంబర్ నుంచి తప్పుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

