Prajwal Revanna | దేవెగౌడ మనవడు ప్రజ్వల్ ఎంపీ ఎన్నిక చెల్లదు.. కర్ణాటక హైకోర్టు తీర్పు
Prajwal Revanna | కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎంపీ ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటంతోపాటు ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించని ఆయనను అనర్హుడిగా ప్రకటించింది.
బెంగళూరు: కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎంపీ ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటంతోపాటు ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించని ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం(ఈసీ)ని ఆదేశించింది.
కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) నుంచి ఏకైక ఎంపీగా ప్రజ్వల్ గెలిచారు. అయితే ఆయన ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని, ఎన్నికల సంఘానికి తన ఆస్తులను ప్రకటించలేదని ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు, ఆ నియోజకవర్గం ఓటరు జీ దేవరాజే గౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి కే నటరాజన్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎంపీగా ప్రజ్వల్ ఎన్నిక చెల్లదన్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.
మరోవైపు, నాడు ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు కూడా ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. అలాగే ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన ప్రజ్వల్ తండ్రి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణతోపాటు మంజుపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు బీజేపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తర్వాత జేడీ(ఎస్)లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

