పంజాబ్ గవర్న ర్కు శృంగభంగం
పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు శృంగభంగం కలిగింది. రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తాననే విచక్షణాధికారం గవర్నర్‌కు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
- అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ నిర్వహణకు న్యాయ సలహా అవసరం లేదు
- రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సులు పాటించాల్సిందే
- తేల్చి చెప్పిన దేశ అత్యున్నత న్యాయస్థానం
- భగవంత్‌మాన్ సర్కారుకు పలు సూచనలు
న్యూఢిల్లీ: పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు శృంగభంగం కలిగింది. రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తాననే విచక్షణాధికారం గవర్నర్‌కు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ అధికారాల్లో ఉన్న సీఎం, గవర్నర్ మధ్య కమ్యూనికేషన్లో గౌరవం, మర్యాద, పరిపక్వ రాజనీతిజ్ఞతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ‘ప్రజాస్వామ్య రాజకీయాల్లో రాజకీయ విభేదాలు అమోదయోగ్యమైనవి. అదే సమయంలో వాడే భాషలో అట్టడుగు స్థానానికి పడిపోకుండా సంయమనం, పరిపక్వతతో పనిచేయాలి’ అని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం సూచించింది. మార్చి 3న అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సమావేశాలు నిర్వహించాలన్న రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సులపై న్యాయ సలహా తీసుకోవాలన్న గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి విషయాల్లో క్యాబినెట్ సహాయం, సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కోర్టు ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.
గవర్నర్ భన్వరీలాల్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. మార్చి 3 నుంచి నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయలేదని చెప్పారు. పంజాబ్ సర్కారు తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. గవర్నర్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు న్యాయ సలహా తీసుకొంటానని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గవర్నర్ రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. ఒకవేళ గవర్నర్ విచక్షణతో వెళితే బడ్జెట్ సమావేశాలు జరుగవు. అసలు ఆయనకు బడ్జెట్ సమావేశాల అర్థం తెలుసా?’ అని గవర్నర్ నిర్ణయాన్ని ఎండగట్టారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా నడుచుకొంటారా? ఆయన ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్, ఆర్టికల్ 167 ప్రకారం.. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం కోరే అధికారం గవర్నర్‌కు ఉంటుందని, ఆ సమాచారాన్ని ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాల్సిందేనని తెలిపింది. అదే సమయంలో క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సిఫారసు చేసినప్పుడు.. గవర్నర్ దానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నది. ఈ విషయంలో గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరమే లేదని, క్యాబినెట్ సలహాలను స్పష్టంగా పాటించాలని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

