రైతుల డిమాండ్‌లో న్యాయం లేదు.. మా అధికారులపై చర్యలు తీసుకోబోం..!
Karnal DM: హర్యానాలో కర్నాల్ జిల్లా అధికారులు, భారతీయ కిసాన్ యూనియన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గత నెల 28న కర్నాల్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులపై
మహాపంచాయత్‌పై రైతు నేతలతో భేటీ అనంతరం కర్నాల్ జిల్లా కలెక్టర్

చండీగఢ్: హర్యానాలో కర్నాల్ జిల్లా అధికారులు, భారతీయ కిసాన్ యూనియన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గత నెల 28న కర్నాల్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీ చార్జిలో 10 మంది రైతులు గాయపడ్డారు. ఈ లాఠీ చార్జికి నిరసనగా ఈ నెల 7న (మంగళవారం) మహాపంచాయత్ పేరుతో రహదారుల దిగ్బంధనం, మిని సెక్రెటేరియట్ ముట్టడి చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం రైతు నేతలతో కర్నాల్ జిల్లా అధికారులు సమావేశమయ్యారు. కానీ, ఈ సమావేశంలో వారి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సమావేశం అనంతరం కర్నాల్ జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రైతుల డిమాండ్లలో న్యాయం లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి నష్టపరిహారం ఇవ్వలేమని, లాఠీ చార్జి చేసిన తమ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆయన స్పష్టంచేశారు. రేపు రైతులు హైవేలను బ్లాక్ చేయకుండా, మినీ సెక్రెటేరియట్‌ను ముట్టడించకుండా తాము అడ్డుకుంటామని చెప్పారు.
కాగా, హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గురునామ్ సింగ్ చారుణి మాట్లాడుతూ.. కర్నాల్ అధికారులతో జరిగిన చర్చలతో ఎలాంటి ఫలితం లభించలేదన్నారు. తాము రేపు మహాపంచాయత్ నిర్వహిస్తామని, ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా జాతీయరహదారిని దిగ్బంధిస్తామని, మినీ సెక్రెటేరియట్‌ను ఘెరావ్ చేస్తామని తెగేసి చెప్పారు. దాంతో కర్నాల్‌లో రేపు ఏం జరుగబోతోందోననే ఉత్కంఠ నెలకొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

