Haryana CM | హర్యానా కొత్త ముఖ్యమంత్రి ఎవరు.. ఆయనకే అవకాశమా..?
Haryana CM | ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విజయం సాధించింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకుని కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లకుగానూ 48 సీట్లు సాధించిన బీజేపీ.. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
Haryana CM : ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విజయం సాధించింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకుని కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లకుగానూ 48 సీట్లు సాధించిన బీజేపీ.. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
దీనిపై ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అయితే ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉన్నప్పటికీ ఇప్పటికే కాషాయదళం ఛాయిస్ క్లియర్గా ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైనీనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఇందులో మరో మాటకు తావులేదని బీజేపీ అధిష్టానం చెబుతున్నట్లు సమాచారం.
ఓబీసీ వర్గాలకు చెందిన సైనీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్లే తాము హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లు భావిస్తున్న బీజేపీ.. ఆయనను సీఎంగా కొనసాగించడం ద్వారా ఆయా వర్గాలకు తాము అనుకూలమే అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలకు సరిగ్గా 200 రోజుల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్ధానంలో అధిష్టానం నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది.
దీనిపై అప్పట్లో పార్టీలో భిన్నస్వరాలు వినిపించాయి. ఖట్టర్ వర్గం కూడా సైనీని అప్పట్లో ఆమోదించలేదు. కానీ క్రమంగా అధిష్ఠానం మనసులో ఏముందో తెలుసుకున్న పార్టీ నేతలు సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆ అస్త్రమే పనిచేసింది. త్వరలో శాసనసభాపక్ష భేటీ ఏర్పాటు చేసి సైనీకే మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

