Watch: యమునా నీటిని తాగిన హర్యానా సీఎం నయాబ్.. కేజ్రీవాల్ అబద్ధం చెబుతున్నారని ఆరోపణ
Nayab Saini | దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో అమోనియా ఎక్కువగా ఉందని, నీరు విషపూరితం కావడానికి హర్యానా కారణమని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం నయాబ్ సైనీ యమునా నదిలోని నీటిని తాగారు.
చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో అమోనియా ఎక్కువగా ఉందని, నీరు విషపూరితం కావడానికి హర్యానా కారణమని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం నయాబ్ సైనీ (Nayab Saini) యమునా నదిలోని నీటిని తాగారు. బుధవారం హర్యానా, ఢిల్లీ సరిహద్దులోని పల్లా గ్రామం వద్ద యమునా నది ప్రవాహంలోని నీటిని దోసిళ్లలోకి తీసుకుని తాగారు. ఆ తర్వాత ఆ నీటిని తన తలపై చల్లుకున్నారు.
కాగా, ఎలాంటి అనుమానాలు లేకుండా యమునా నది నీటిని తాను తాగినట్లు హర్యానా సీఎం నయాబ్ సైనీ తెలిపారు. ‘ఢిల్లీ సీఎం అతిషి రాలేదు. ఆమె కొత్త అబద్ధాన్ని సృష్టిస్తుండాలి. కానీ అబద్ధాలకు కాళ్ళు లేవు. అందుకే ఆప్-డా అబద్ధాలు పనిచేయడం లేదు’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనస్సులలో భయాన్ని సృష్టించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని హర్యానా సీఎం సయాబ్ సైనీ ఆరోపించారు. జల వనరుల అధికారులు సేకరించిన నీటి నమూనాల్లో ఎలాంటి విష ఆనవాళ్లు లేవని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ తన జీవితాంతం అబద్ధాలు చెబుతారని విమర్శించారు. కృతజ్ఞత లేని హర్యానా కుమారుడైన కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు శిక్షిస్తారని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడిస్తారని అన్నారు.
बेहिचक और बेझिझक पवित्र यमुना के जल का आचमन किया हरियाणा की सीमा पर।
आतिशी जी तो आईं नहीं।कोई नया झूठ रच रही होंगी।झूठ के पांव नहीं होते।इसलिए आप-दा का झूठ चल नहीं पा रहा।
दिल्ली की देवतुल्य जनता इन फ़रेबियों को पहचान चुकी है।5 फ़रवरी को आप-दा के फरेब काल का अंत निश्चित है।… pic.twitter.com/EAG4pXjCFr
— Nayab Saini (@NayabSainiBJP) January 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

