ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్సకు రూ.35,000 ఆర్థిక సహాయం

చండీగఢ్: కరోనా బారిన పడిన పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.35,000 ఆర్థిక సహాయాన్ని హర్యానా సీఎం మనోహర్ లాఖ ఖట్టర్ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న రోగికి రోజుకు రూ.5,000 చొప్పున గరిష్ఠంగా వారం రోజులకు రూ.35 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. హర్యానాకు చెందిన కరోనా రోగులకు వైద్య చికిత్స అందించే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రోత్సాహకంగా ఒక రోగికి రోజుకు రూ.1,000 చొప్పున గరిష్ఠంగా రూ.7,000 చెల్లిస్తామని చెప్పారు. ఈ విధంగా ఒక పేద రోగికి కరోనా చికిత్సకు మొత్తం రూ.42,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు.
మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్సకు పడకల ధరలను కూడా హార్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఏబీహెచ్, జేసీఐ గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ఐసోలేషన్ పడకకు రూ.10,000, వెంటిలేటర్లు లేని ఐసీయూ పడకకు రూ .15 వేలు, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకకు రోజుకు రూ .18,000 చొప్పున నిర్ణయించింది.
ఎన్ఏబీహెచ్ గుర్తింపు లేని ఆసుపత్రులలో ఐసోలేషన్ పడకకు రూ .8,000, వెంటిలేటర్లు లేని ఐసీయూ పడకకు రూ .13,000, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకకు రోజుకు రూ .15 వేలు చొప్పున ధర నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం బుధవారం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

