Anil Vij | బీజేపీలోనే ఉన్నా.. పార్టీ కోసం పని చేస్తా: అనిల్ విజ్
Anil Vij | తాను బీజేపీలోనే ఉన్నానని హర్యానాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు అనిల్ విజ్ (Anil Vij) తెలిపారు. బీజేపీ భక్తుడినన్న ఆయన, పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. హర్యానా సీఎం మార్పు నేపథ్యంలో ఆ పదవి ఆశించిన అనిల్ విజ్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చండీగఢ్: తాను బీజేపీలోనే ఉన్నానని హర్యానాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు అనిల్ విజ్ (Anil Vij) తెలిపారు. బీజేపీ భక్తుడినన్న ఆయన, పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. హర్యానా సీఎం మార్పు నేపథ్యంలో ఆ పదవి ఆశించిన అనిల్ విజ్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త సీఎంగా నయాబ్ సైనీని ఎన్నుకోవడంతో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ నుంచి అనిల్ విజ్ వాకౌట్ చేశారు. మీటింగ్‌లో ఏం జరిగిందని మీడియా ప్రశ్నించగా ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు చెబుతారంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, సీఎంగా నయాబ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అనిల్ విజ్ హాజరుకాలేదు. అయితే ఒక రోజు తర్వాత ఆయన కొంత శాంతించారు. తాను ఇప్పటికీ బీజేపీలో ఉన్నానని స్పష్టం చేశారు. ‘నేను బీజేపీ భక్తుడ్ని. పరిస్థితులు మారవచ్చు కానీ నేను పార్టీ కోసం పని చేస్తూనే ఉంటా’ అని అన్నారు.
మరోవైపు 2014లో హర్యానాలో సొంత బలంతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి రేస్‌లో అనిల్ విజ్ ఉన్నారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో అనిల్ విజ్ నాడు కూడా పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- anil vij
- BJP
- haryana
- Nayab Saini
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

