కు.ని. ఆపరేషన్ చేసుకున్న వరుడిలా అయిపోయా… సొంత పార్టీపై హార్థిక్ పటేల్ తీవ్ర అసంతృప్తి
సరిగ్గా కాంగ్రెస్ అధిష్ఠానం గుజరాత్‌పై ఫోకస్ పెట్టిన సమయంలోనే కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ సొంత పార్టీపైనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ పీసీసీలో కొందరు తనను పక్కన పెట్టేస్తున్నారని, పార్టీ వీడి వెళ్లేలా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పీసీసీ తనను అష్టకష్టాలూ పెడుతోందని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ చేసుకున్న వరుడిలా తన పరిస్థితి తయారైంది అంటూ హార్థిక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లానని, అయినా ఫలితం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీలతో గుజరాత్ పీసీసీ నేతలు లోపాయికారీ ఒప్పందం పెట్టుకోవడ వల్లే అధికారానికి కాంగ్రెస్ దూరమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్లో 2017 ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని, కానీ… తప్పుడు నేతలకు టిక్కెట్ ఇవ్వడం వల్లే ఓడిపోయిందని హార్థిక్ పటేల్ అన్నారు.
తనను గుజరాత్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారని, అయినా తనకు అధికారాలేమీ లేవని హార్థిక్ పటేల్ వాపోయారు. అత్యంత కీలకమైన సమావేశాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని, ఏ నిర్ణయాల్లోనూ తనను భాగస్వామిని చేయడం లేదని పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించి, మూడు సంవత్సరాలు గడించిందని, అయినా అధికారాలు ఇవ్వరా? అంటూ హార్థిక్ పటేల్ తీవ్రంగా మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

