న్యూఢిల్లీ: ఆకలితో ఉన్న కుక్క ఆహారం పెట్టమని వినూత్నంగా అడుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి సోమవారం ఒక వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘నాకు ఆకలి వేసిన 0.5 మెక్రో సెకండ్ల తర్వాత’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇందులో ఒక కుక్క ఆహారం కోసం రెండు సార్లు అరుస్తుంది. యజమాని పట్టించుకోకపోవడంతో రోజు ఆహారం తినే ఖాళీ గిన్నెను కోపంతో విసురుతుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా ఆహారం పెట్టమని ఇంట్లో వారిపై మనం చిందులు వేయడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
0.5 micro seconds after I get hungry pic.twitter.com/K4je9iBI0u
— Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) April 5, 2021
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్, కుక్క కోపం ముద్దొస్తున్నది.. అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఇమోజీలతో బదులిచ్చారు.