Propellant Tank : ఇస్రోకు భారీ ప్రొపెల్లెంట్ ట్యాంక్‌ను అందించిన హెచ్ఏఎల్
Propellant Tank : అత్యంత భారీ సెమీ-క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్‌ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్...

న్యూఢిల్లీ : (Propellant Tank) అత్యంత భారీ సెమీ-క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్‌ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అందించింది. భవిష్యత్ మిషన్ల కోసం ఎంకే-III ప్రయోగ వాహనంలో ఈ ట్యాంక్‌ను ఉపయోగించనున్నారు. సెమీ క్రియో లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్‌ఓఎక్స్) ట్యాంక్ మొదటి డెవలప్మెంటల్ వెల్డింగ్ హార్డ్‌వేర్ అనేది ఎస్సీ120 స్టేజ్‌లో భాగం. ఇది ప్రస్తుతం ఉన్న ఎంకే-III లాంచ్ వాహనంలో ఉపయోగించడం ద్వారా ఎల్110 స్టేజ్‌ని భర్తీ చేసి పేలోడ్ మెరుగుదల కోసం సహకరిస్తుంది. గత ఏడాది అతిపెద్ద క్రయోజెనిక్ లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్‌ను ఇస్రోకు హెచ్ఏఎల్ పంపిణీ చేసింది. ఇది నాలుగు మీటర్ల వ్యాసం, ఎనిమిది మీటర్ల పొడవుతో ఉన్నది. ఒప్పంద షెడ్యూల్ కంటే చాలా ముందుగా చేరింది.
వెల్డింగ్ ప్రొపెల్లెంట్ ట్యాంకుల తయారీకి కావల్సిన నైపుణ్యత, సాంకేతికతలపై హెచ్ఏఎల్ పట్టు సాధించింది. ఇవ్వాల్టి వరకు 244 ప్రొపెల్లెంట్ ట్యాంకులు, 95 వాటర్ ట్యాంకులు ఇస్రోకు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎంకే-II, జీఎస్ఎల్వీ ఎంకే-III కు హెచ్ఏఎల్ ఏరోస్పేస్ డివిజన్ అందించింది. గత ఐదు దశాబ్దాలుగా ఇస్రోకు అవసరమైన యంత్రాలను హెచ్ఏఎల్ తయారుచేసి ఇస్తున్నది. ఇప్పటివరకు క్రయో, సెమీ క్రయో ఇంజిన్లను తయారు చేసే గురుతర బాధ్యతను హెచ్ఏఎల్ తన భుజాలపై ఎత్తుకుని విజయవంతంగా పూర్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
నవంబర్ 15 నుంచి విదేశీయులకు టూరిస్ట్ వీసాలు
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం రెండో పాకిస్తాన్ అయ్యేది: ప్రభు చౌహాన్
బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనక, వరుణ్ ఔట్!
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి : వెంకయ్యనాయుడు
మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం
సంపాదనలో 10 వ వంతు దానం చేయమన్న గురు గోవింద్ సింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

