cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురు వ్యక్తులకు గుజరాత్ కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.3 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా హిందూ గ్రంథాలను కోర్టు ప్రస్తావించింది.
గాంధీనగర్: గోవధ కేసులో ముగ్గురు వ్యక్తులకు గుజరాత్ కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.3 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా హిందూ గ్రంథాలను కోర్టు ప్రస్తావించింది. (cow slaughter case) గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2024 ఆగస్ట్ 22న జమ్లా గ్రామంలోని ఒక ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. 277 కిలోల గొడ్డు మాంసం, ఆవులను వధించడానికి ఉపయోగించే ఆయుధాలు, మాంసాన్ని రవాణా చేసే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు.
కాగా, నిందితులైన తండ్రీకొడుకులు బలహీనంగా లేదా పాలివ్వని ఆవులను కొనుగోలు చేసి, గొడ్డు మాంసాన్ని అమ్మేందుకు వాటిని వధించేందుకు అహ్మదాబాద్ నుంచి నలుగురిని తమ ఇంటికి తీసుకువచ్చేవారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 54 మంది సాక్షులు, 18 డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది.
మరోవైపు గాంధీనగర్ జిల్లా కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. గోవుకు ఉన్న మతపరమైన ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంతో పాటు హిందూ గ్రంథాలను ఉటంకించింది. ప్రాచీన సంస్కృత గ్రంథమైన ‘మనుస్మృతి’ ప్రకారం గోవు కేవలం ఒక జంతువు మాత్రమే కాదని, భౌతిక శ్రేయస్సుకు, ధర్మానికి మూలస్తంభంగా దానిని పరిగణిస్తారని కోర్టు తెలిపింది. ‘తపస్సు శక్తి వల్ల భూమిపై ‘అమృత’ బిందువులు పడినప్పుడు, దివ్య గోవు ‘కామధేనువు’ ఉద్భవించింది. భూమిపై ఉన్న సమస్త గో జాతికి ‘ఆది మాత’గా పరిగణిస్తారు. ఆవును ‘జగత్తుకు తల్లి’గా భావిస్తారు. ఇది 33 కోట్ల దేవతలకు నిలయంగా ఉంది. దాని నాలుగు కాళ్లు నాలుగు వేదాలకు ప్రతీక’ అని కోర్టు పేర్కొంది.
అలాగే ఆరుగురు నిందితులలో ముగ్గురిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. వసీం ఖురేషి, మహమ్మద్ రఫీక్ ఖురేషి, అస్ఫాక్ బహేలింలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది. అదనపు సెషన్స్ జడ్జి బి.ఆర్. రాజ్‌పుత్, అక్టోబర్ 26న ఈ తీర్పును వెలువరించారు.
గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఈ తీర్పును స్వాగతించారు. రాష్ట్రంలో గోవధకు పాల్పడేవారిని చట్టం వదిలిపెట్టదనే స్పష్టమైన సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందన్నారు. అయితే 1954 నాటి ‘గుజరాత్ పశు సంరక్షణ చట్టం’ను 2017లో సవరించారు. గోవధకు విధించే శిక్షను ‘జీవిత ఖైదు’గా గుజరాత్ ప్రభుత్వం పెంచింది. తద్వారా ఈ నేరానికి అలాంటి శిక్షను నిర్ణయించిన దేశంలోని మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో ఎంపీ వద్దిరాజు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

