Raghu Sharma | గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని కోరారు.
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ 15 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 1 స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 20 స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది.