ఓఖా (గుజరాత్) : ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) నౌకలు, పడవల కదలికల గురించి పాకిస్థాన్ గూఢచారికి సమాచారం ఇస్తున్న దీపేష్ గోహిల్ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్కాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. దీపేష్ ఐసీజీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
ఐసీజీ పడవలు, నౌకలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నందుకు అతనికి రోజుకు రూ.200 చొప్పున పాక్ గూఢచారి ఇస్తున్నాడు. మొత్తం మీద అతనికి ఆ పాకిస్థాన్ ఏజెంట్ నుంచి రూ.42 వేలు అందింది. ఫేస్ బుక్ ద్వారా వీరిద్దరికీ పరిచయమైనట్లు వెల్లడైంది.