Thar Desert | న్యూఢిల్లీ: వచ్చే శతాబ్దానికి థార్ ‘ఏడారి’ కాస్త నందన వనంగా మారనుంది! వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలోని మిగతా ఎడారులన్నీ మరింత వేడెక్కుతుంటే.. థార్‌లో పచ్చదనం పరుచుకుంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్ దీనికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. పరిమిత గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భారత్‌లోని వాయువ్య పాక్షిక శుష్క ప్రాంతాల్లో వర్షపాతం 50-200 శాతానికి పెరిగే అవకాశం ఉన్నదని అధ్యయనం తెలిపింది.