Today History: మన సినమాలు ఇప్పుడు అతర్జాతీయ స్థాయిలోకి వెళ్తున్నాయని గొప్పలకు పోతున్న మనం.. గతం మర్చిపోతున్నాం. సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తీసుకొచ్చారు మన దర్శకుడు బిమల్‌రాయ్. అంతటి గొప్ప దర్శకుడు 1966 లో సరిగ్గా ఇదే రోజున మనల్ని విడిచిపెట్టిపోయారు. హిందీ, బెంగాలీ భాషల్లో సినిమాలు నిర్మించి.. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.
ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1909 జూలై 12 న జన్మించిన బిమల్ రాయ్.. తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ వివాదంతో జమీందారీ నుంచి బహిష్కరనకు గురయ్యాడు. దాంతో సినిమాలపై ఆసక్తితో కోల్‌కతాకు వచ్చి కెమెరా అసిస్టెంట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. 1950 లో తన బృందంతో కలిసి ముంబైకి వెళ్లిన బిమల్ రాయ్.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో అద్భుత సినిమాలను అందించారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన 11 ఫిల్మ్‌ఫేర్, జాతీయ, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను అందుకున్నారు. 1958 లో ఈయన నిర్మించిన ‘మధుమతి’ సినిమా ఏకంగా 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెల్చుకున్నది. ఈ రికార్డు 37 ఏండ్ల వరకు బద్దలు కొట్టలేదంటే ఆయన పనితనం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
బిమల్ రాయ్ మధుమతి, బందిని, సుజాత, దేవదాస్ వంటి అనేక ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. అయితే, 1953 లో వచ్చిన ‘దో బిఘా జమీన్’ సినిమాతో బిమల్ రాయ్ అత్యంత కీర్తిని గడించాడు. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అనంతరం అదే వేదికపైన బిమల్ రాయ్‌ను ఘనంగా సత్కరించారు. ఈయన తన 56వ ఏట క్యాన్సర్‌తో మరణించాడు.
2017: ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరిగిన ట్రక్కు దాడిలో నలుగురు సైనికులు మృతి
2003: థాయ్‌లాండ్‌లో శ్రీలంక ప్రభుత్వం-ఎల్టీటీఈ మధ్య చర్చలు ప్రారంభం
2001: ఐవరీ కోస్ట్ తిరుగుబాటు విఫలం
1995: స్వాతంత్ర్య సమరయోధుడు మధు లిమాయే మరణం
1982 : ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ జననం
1942: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం
1929: నెదర్లాండ్స్-వెస్టిండీస్ మధ్య మొదటి టెలిఫోన్ పరిచయం
1929: నటుడు సయీద్ జాఫ్రీ జననం
1884: సామాజిక సంస్కర్త కేశవ్ చంద్ర సేన్ జననం
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..