థర్డ్ వేవ్ కట్టడి : రూ 20,000 కోట్లతో కొవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్!

న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ తలెత్తితే దీటుగా ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ సన్నద్ధత (ఈసీఆర్పీ-2) కింద రూ 20,000 కోట్ల ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. తదుపరి కొవిడ్-19 వేవ్ దేశాన్ని తాకితే ముందుగానే సన్నద్ధమై దాని వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిధి ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ప్యాకేజ్‌పై ప్రస్తుతం ఆరోగ్య, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు మదింపు చేస్తుండగా కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం ప్యాకేజ్ వివరాలను వెల్లడిస్తారు. దవాఖానలో పడకల పెంపు, కొవిడ్-19 వైద్య పరికరాలు, చికిత్స సదుపాయాల పెంపు, అత్యవసర మందుల సరఫరాలతో పాటు జాతీయ, రాష్ట్ర స్ధాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పెంపునకు ఈ నిధులను వెచ్చిస్తారు.
మూడో వేవ్ తప్పదనే సంకేతాలతో పాటు డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరమైనదేనని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నిధి ఏర్పాటు దిశగా కేంద్రం కసరత్తు సాగిస్తోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ ప్యాకేజ్ అమలు కానుండగా ఐసీఎంఆర్ వంటి పరిశోధనా సంస్ధలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. జీనో్మ్ సీక్వెన్సింగ్ ద్వారా నూతన వేరియంట్లను గుర్తించడం ద్వారా చికిత్స సులువుగా చేపట్టే వెసులుబాటు ఉండటంతో పరిశోధనా సంస్ధలను ఆ దిశగా ప్రోత్సహిస్తారు. సెకండ్ వేవ్ వ్యాప్తిలో ఎదురైన అనుభవాలతో థర్డ్ వేవ్‌ను సమర్ధంగా కట్టడి చేసేందుకు కేంద్రం ముందస్తు చర్యలతో సన్నద్ధమవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- package
- Third Wave
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

