ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధం.. ఆల్‌పార్టీ మీట్లో ప్రధాని మోదీ
Prime Minister Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం పార్లమెంట్ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్, డీఎంకేకు చెందిన తిరుచి శివతోపాటు 33 పార్టీల నుంచి 40 మందికిపైగా నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు, సలహాలు చాలా విలువైనవని సమావేశానికి హాజరైన వివిధ పార్టీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆరోగ్యకరమైన, ఫలవంతమైన చర్చ జరుగాలని కూడా ప్రధాని తన ఆకాంక్ష వెలిబుచ్చినట్లు చెప్పారు. కాగా, ఈ సమావేశాల్లో పలు చట్టాలను చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 19న ప్రారంభమయ్యే ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

