Union Govt | నాలుగేళ్లలోపు చిన్నారులకు ఆ మందులు వాడొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు..!
Union Govt | చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలోపు చిన్నారులకు క్లోర్ఫెనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate), ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) తో కూడిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీని పరిమితం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Union Govt : చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలోపు చిన్నారులకు క్లోర్ఫెనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate), ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) తో కూడిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీని పరిమితం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సాధారణంగా జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యల నివారణకు వాడే ఔషధాలలో ఈ కాంబినేషన్‌ను వినియోగిస్తారు. ఇకపై ఈ మందుల లేబుల్స్, ప్యాకేజీలపై ‘ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్‌ను నాలుగేళ్ల లోపు పిల్లలకు ఇవ్వరాదు’ అనే హెచ్చరికను తప్పనిసరిగా ముద్రించాలని ఔషధ తయారీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ) చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
గతంలో 2025 ఏప్రిల్ 15న ఈ సమ్మేళనాలు కలిగిన కొన్ని ఎఫ్డీసీ మందులపై మాత్రమే ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధించగా.. తాజా ఉత్తర్వుల ద్వారా ఈ నిబంధనను అన్ని రకాల ఫార్ములేషన్లకు వర్తింపజేసింది. నాలుగేళ్లలోపు చిన్నారులపై ఈ మందులు ప్రతికూల ప్రభావంచూపే అవకాశం ఉందని, వీటికి బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940లోని సెక్షన్ 26ఏ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

