షెడ్యూల్ ప్రకారమే అమర్నాథ్ యాత్ర..
శ్రీనగర్: షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్లో వరుస హత్యా ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జూన్ 30వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అమర్నాథ్ యాత్రను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లోయలో జరుగుతున్న హత్యా ఘటనలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్న ఘటనలను నిరోధించవచ్చు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో పండిట్లపై దాడులు జరుగుతున్నట్లు వారంటున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ హత్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసే విధంగా హత్యా ఘటనలు జరుగుతున్నాయని, అయినా వెనక్కి తగ్గేదిలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
2020 నుంచి కోవిడ్ వల్ల అమర్‌నాథ్‌యాత్రను నిలిపేశారు. అయితే ఈ ఏడాది ఇప్పటికే 2.5 లక్షల మంది యాత్రికులు ఆ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. కశ్మీర్ పండిట్లను జమ్మూకు తరలించేది లేదని, 1990 తరహా లాంటి ఘటనలు జరగనివ్వమని, కానీ పండిట్లను లోయలోనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.
ఇటీవల పండిట్లను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్లు కశ్మీర్‌ను వదిలివెళ్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరు వేల మంది హిందూ ఉద్యోగులను ఇప్పటికే మరో ప్రాంతానికి తరలించారు.ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కశ్మీర్‌కు 10 లక్షల మంది టూరిస్టులు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

