Google | ఉద్యోగులకు మరో షాకిచ్చిన గూగుల్.. ఈ ఏడాది మరిన్ని కోతలు ఉంటాయన్న సీఈవో సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వెయ్యి మందిని తొలగిస్తున్నట్టు గూగుల్ ఈ వారమే ప్రకటించింది.
Google | న్యూఢిల్లీ, జనవరి 18: టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వెయ్యి మందిని తొలగిస్తున్నట్టు గూగుల్ ఈ వారమే ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు ఇంకా ఆగిపోలేదని, ఈ ఏడాది మరింత అధికంగా ఉంటాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిర్ధారించారు. ఈ సందర్భంగా ‘లేఆఫ్’ అన్న పదాన్ని వాడటాన్ని ఆయన వ్యతిరేకించారు.
ఈ ఏడాది సంస్థలో చేపట్టే భారీ మార్పుల గురించి ఇంటర్నెట్లో లీకైన ఆయన అంతర్గత మెమోలో వివరించారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కంపెనీ సిబ్బందిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు. అయితే లేఆఫ్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దానికి బదులుగా సంస్థకు మీరు అవసరం లేదని చెప్పడం ఒక ఫ్యాన్సీ మార్గమని ఆయన పేర్కొన్నారు. కాగా, యూట్యూబ్‌లో సుమారు 100 మంది ఉద్యోగులపై గూగుల్ తాజాగా వేటు వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

