Goods train derails | పట్టాలు తప్పిన ఎల్పీజీ గూడ్స్ రైలు.. తప్పిన పెను ప్రమాదం
Goods train derails | ఎల్పీజీతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది (Goods train derails). ఈ సంఘటనతో మరో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
భోపాల్: ఎల్పీజీతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది (Goods train derails). ఈ సంఘటనతో మరో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారత్ పెట్రోలియం సంస్థకు చెందిన ఎల్పీజీ కంటైనర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. షాపురా భిటోని స్టేషన్ సమీపంలో ఉన్న భారత్ పెట్రోలియం డిపోకు ఎల్పీజీని రవాణా చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు అర్థరాత్రి వేళ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో లూప్ లైన్ కొంత దెబ్బతిన్నట్లు తెలిపారు. ఎల్పీజీ ర్యాక్‌లు ధ్వంసం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. అలాగే మెయిన్ లైన్‌కు ఎలాంటి నష్టం జరుగలేదని అన్నారు. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.
మరోవైపు జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొంది. దీంతో రైల్వే గేటు, రైలు పట్టాల మధ్యలో ఆ ట్రాక్టర్ ఇరుక్కు పోయింది. అదే సమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆ రైల్వే గేట్‌ను సమీపించింది. అయితే ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న ట్రాక్టర్‌ను గమనించిన లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
#WATCH | Two wagons of LPG rake of a goods train derailed while being placed for unloading last night in Shahpura Bhitoni, Jabalpur of Madhya Pradesh. Train movement is normal in main line. Restoration work started after sunrise in the presence of siding authorities. Fitness… pic.twitter.com/F2StcFHDFi
— ANI (@ANI) June 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

