గోవా ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు : డీకే శివకుమార్
గోవా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, గోవా ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ అన్నారు. మార్పుతో పాటు గోవా ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులతో డీకే శివకుమార్ బుధవారం భేటీ అయ్యారు. ప్రస్తుత అంశాలు, ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే పరిణామాలపై డీకే వారితో చర్చించారు. తమ అభ్యర్థులందరూ రిసార్ట్‌లోనే ఉంటారని హామీ ఇచ్చారని, ఒక్కరు కూడా కాంగ్రెస్ నుంచి పోరని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ కలిసి కట్టుగానే వుంటారని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
గోవాలో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. 2017 లాంటి పరిస్థితుల్లో చిక్కకూడదని, ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులందర్నీ రిసార్టులకు పంపించారు. ఇదే విషంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సునీల్ కత్నీకర్ స్పందించారు. తాము బలవంతంగా ఎవ్వర్నీ రిసార్టులకు పంపలేదని, అభ్యర్థులందరూ స్వచ్ఛందంగానే రిసార్టులకు వెళ్లారని ఆయన ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చిన్న పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. ఈ బాధ్యతలను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, డీకే శివకుమార్‌కు అప్పగించింది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీలతో వీరు మాట్లాడారు. అలాగే ఆప్, తృణమూల్‌తో కూడా సంభాషణలు జరుగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

