Special Status | బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. నితీశ్ కుమార్ పార్టీ డిమాండ్
Special Status | బీహార్‌కు ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) డిమాండ్ చేసింది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది.
పాట్నా: బీహార్‌కు ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) డిమాండ్ చేసింది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. బీహార్ ఆర్థికంగా, అభివృద్ధిలో వెనుక ఉండటాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
కాగా, బీహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు. న్యాయపర పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో రిజర్వేషన్ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది.
మరోవైపు జేడీయూ కీలక సమావేశం తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత మీడియాతో మాట్లాడారు. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదని తెలిపిరు. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయడం, రాష్ట్ర ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- demands
- JDU
- Nitish Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

