సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ చేసి ప్లాస్టిక్ సంచులతో నింపినట్లు ఆరోపణలు
బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు.
న్యూఢిల్లీ: సర్జరీ తర్వాత ఒక బాలిక మరణించింది. అయితే ఆమె శరీరంలోని అవయవాలు చోరీ చేసి ప్లాస్టిక్ సంచులతో నింపినట్లు ఆ బాలిక కుటుంబం ఆరోపించింది. కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలిక, పేగుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. జనవరి 21 ఆసుపత్రిలో అడ్మిట్ కాగా 24న సర్జరీ చేశారు. అయితే జనవరి 26న ఆ బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సర్జరీ సమయంలో ఆమె శరీరంలోని అవయవాలను చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు మెడికల్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని పోలీసులు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Girl
- organs
- plastic bags
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

