Nawaz Singhania | ‘నా భర్త పెద్ద సైకో’.. రేమండ్ గ్రూప్ అధినేతపై ఆయన భార్య కామెంట్స్..!
Nawaz Singhania | రేమండ్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ సింఘానియా విడాకుల వ్యవహారం రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నది. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరూ ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తాజాగా గౌతమ్ సింఘానియా వ్యక్తిత్వం గురించి నవాజ్ సింఘానియా మాట్లాడిన ఆడియో ఫైల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై: రేమండ్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ సింఘానియా విడాకుల వ్యవహారం రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నది. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరూ ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తాజాగా గౌతమ్ సింఘానియా వ్యక్తిత్వం గురించి నవాజ్ సింఘానియా మాట్లాడిన ఆడియో ఫైల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ఆడియో క్లిప్‌లో నవాజ్ ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే.. ‘నేను తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే తిరుమల వస్తానని గౌతమ్ సింఘానియా తిరుమల శ్రీవారికి మొక్కుకున్నాడు. అనుకున్నట్లే మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత మొక్కు తీర్చుకోవడం కోసం ఓ రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లాం. అక్కడ తన భర్త సైకోలా వ్యవహరించాడు. గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వకుండా తిరుపతి మెట్లు ఎక్కించాడు’ అంటూ నవాజ్ మోదీ తన భర్త గౌతమ్ సింఘానియా గురించి ఆరోపణలు చేశారు.
‘తిరుమల కొండపైకి వెళ్తున్న సమయంలో ఎన్ని మెట్లు ఉంటాయో తెలీదు. కానీ తిండి, నీళ్లు తాగకుండా మెట్లెక్కాను. దాదాపు రెండు మూడు సార్లు స్పృహతప్పి పడిపోయాను. స్పృహ కోల్పోయినా పైకి లేపి మరీ నడిపించాడు. అలా శ్రీవారిని దర్శించుకున్నాం’ అని నవాజ్ చెప్పారు. సింఘానియా దైవభక్తి గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. కానీ ఇతర దేవుళ్లకు కాదు. ఎందుకంటే..? తిరుమల శ్రీవారు అపర కుబేరులు కదా..!’ అని వ్యాఖ్యానించారు. ఈ ఆడియో ఫైల్ వ్యాపార వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

