తిహార్ జైలులో కరోనా కలకలం.. గ్యాంగ్‌స్టర్ షాహాబుద్దీన్‌కు పాజిటివ్
గ్యాంగ్‌స్టర్ షాహాబుద్దీన్‌కు కరోనా | ఢిల్లీలోని తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా బారిపడ్డారు.

న్యూఢిల్లీ : జంట హత్యల కేసులో ఢిల్లీలోని తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, మాజీ ఆర్జేడీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా బారిపడ్డారు.
బుధవారం ఆయనకు వైద్యులు పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారీ పోలీసుల బందోబస్తు నడుమ అతడిని చికిత్స నిమిత్తం స్థానిక డీడీయూ ఆసుపత్రికి తరలించారు.
షాహాబుద్దీన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైలు అధికారులు తెలిపారు.
2004లో జరిగిన జంట హత్యల కేసులో షాహాబుద్దీన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. దోపిడీ చేసిన సొమ్మును ఇవ్వనందుకు తన ఇద్దరు సోదరులను షాహాబుద్దీన్ హతమార్చాడు.
బీహార్‌లోని జిరాడే నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా.. సివాన్ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా షాహాబుద్దీన్ ఎన్నికయ్యాడు.
జైళ్ల సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య..
తిహార్‌లోని మూడు జైళ్లలో ఇప్పటికే చాలా మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఈ నెల 12 నాటికి 59 మంది ఖైదీలు ఏడుగురు జైలు సిబ్బందికి వైరస్ సోకింది.
ఏప్రిల్ 17 నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. ఢిల్లీలోని తిహార్, రోహిని, మండోలి జైళ్లలో దాదాపు 18,900 మంది ఖైదీలను ఉంచారు. ఈ మూడు జైళ్ల పూర్తి సామర్థ్యం 10,026 మంది మాత్రమే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

