గాంధీ, అంబేద్కర్ విగ్రహాల తరలింపు
పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీజీ, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ తదితర మహనీయుల విగ్రహాలను మరో చోటుకు తరలించడంపై వివాదం రేగింది.
- పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం చర్యపై కాంగ్రెస్ ఆగ్రహం
- 400 సీట్లు ఇచ్చుంటే రాజ్యాంగాన్నీ వదిలిపెట్టేవారు కాదేమోనని విమర్శ
న్యూఢిల్లీ, జూన్ 6: పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీజీ, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ తదితర మహనీయుల విగ్రహాలను మరో చోటుకు తరలించడంపై వివాదం రేగింది. పాత పార్లమెంట్ భవనం,పార్లమెంట్ గ్రంథాలయం మధ్య ఉన్న పార్క్ వద్దకు వీటిని మార్చారు. కాంగ్రెస్ మీడియా విభాగాధిపతి పవన్ ఖేరా ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్ర ఓటర్లు బీజేపీకి ఓటేయలేదని శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను తొలగించారు.
గుజరాత్లో తాము క్లీన్‌స్వీప్ చేయలేదని గాంధీజీ విగ్రహాన్నీ పక్కకు తరలించారు. వాళ్లకు 400 సీట్లు ఇచ్చుంటే రాజ్యాంగాన్నీ వదిలిపెట్టేవారు కాదేమో’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ నెలలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ ప్రాంగణాన్ని నవీకరిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ నాయకుల విగ్రహాలను పార్లమెంట్ ప్రాంగణంలోనే వేరే చోటికి తరలిస్తున్నారు. విగ్రహాల తరలింపు ద్వారా ఏర్పడిన ఖాళీ స్థలంలో రాష్ట్రపతి, ప్రధాని కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించే మార్గాలను నిర్మిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

