Rajasthan Polls | అవినీతిలో నిండా మునిగిన అశోక్ గెహ్లాట్ సర్కార్ : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
రాజస్ధాన్‌లో (Rajasthan Polls) అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆరోపించారు. మధ్యాహ్న భోజన పధకం, మైనింగ్ సహా ఎన్నో స్కామ్‌లతో కాంగ్రెస్ సర్కార్ భ్రష్టుపట్టిందని అన్నారు.
జైపూర్ : రాజస్ధాన్‌లో (Rajasthan Polls) అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆరోపించారు. మధ్యాహ్న భోజన పధకం, మైనింగ్ సహా ఎన్నో స్కామ్‌లతో కాంగ్రెస్ సర్కార్ భ్రష్టుపట్టిందని అన్నారు. అశోక్ గెహ్లాట్ సర్కార్ అత్యంత అవినీతిమయ సర్కార్ అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. యోజన భవన్‌లోని బేస్మెంట్లో కిలో బంగారం బయటపడిన నేపధ్యంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్ధలు రంగంలోకి దిగడంతో 16 కిలోల బంగారం దొరికిందని, అవినీతిపై దర్యాప్తు సంస్ధలు చేపట్టినప్పుడల్లా సీఎం మొసలి కన్నీరు కారుస్తున్నారని, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని కేకలు పెడుతుంటారని దుయ్యబట్టారు. గెహ్లాట్ క్యాబినెట్ నుంచి ఇటీవల తొలగించిన రాజేంద్ర గుధ రెడ్ డైరీ గురించి వెల్లడించడాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
అవినీతిలో అందరూ పాలుపంచుకున్నా చర్యలు చేపట్టడం మొదలవడంతో ఓ మంత్రిని బలి చేశారని అన్నారు. గజేంద్ర షెకావత్ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది చివరిలో రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్, బీజేపీ పరస్పరం తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
Read More :
BJP hate speech | విద్వేష ప్రసంగాల్లో బీజేపీనే టాప్.. హిందూత్వ వాచ్ సంస్థ వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

