ఎన్నికల తర్వాతపెట్రో వాత?
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీలు లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టాలను భరిస్తున్నాయి.
- లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై 35
- నష్టాలను భరిస్తున్న చమురు కంపెనీలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీలు లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టాలను భరిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు చమురు ధరలు పెంచితే అవి అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ర్టాలపై ప్రతికూల ప్రభావం పడనున్నందున వాటి ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం పెట్రో ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది.
చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలోని మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలు రోజుకు రూ.2,400 కోట్ల నష్టాన్ని ఎదుర్కోనుండగా, ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించడంతో ఈ నష్టం రూ.1,600 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు మనపై లీటర్‌కు రూ.6 భారం పడుతుంది. కాగా, 2022 ఆగస్టు తర్వాత తొలిసారిగా అమెరికా సగటున ప్రతి గ్యాలన్ పెట్రోల్‌కు 4 డాలర్లు పెంచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

