Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Calling Name Presentation: ఫోన్ ఎవరు చేసినా.. ఇక మీ ఫోన్ స్క్రీన్‌పై ఆ నెంబర్‌తో పాటు వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా డిస్ప్లే అవుతుంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త ఆదేశాలు అములోకి రానున్నాయి. టెలికం శాఖ అన్ని కంపెనీలకు ఈ ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ: మీకు ఫోన్ కాల్ వస్తే, ఇక నుంచి ఆ నెంబర్ ఉన్న వ్యక్తి పేరు కూడా డిస్ప్లే కానున్నది. టెలికమ్యూనికేషన్స్ శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఆదేశాలను కచ్చితంగా టెలికాం ఆపరేటర్లు అమలు చేయాల్సి ఉంటుంది. 4జీ, 5జీ నెట్వర్క్ ఉన్న ఫోన్లకు కూడా ఇక నుంచి కాల్స్ వస్తే, ఆ ఫోన్లపై వ్యక్తి పేరు కూడా దర్శనం ఇవ్వనున్నది. సీఎన్ఏపీ.. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్(Calling Name Presentation) సర్వీస్ ద్వారా కాలర్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని పటిష్టం చేయనున్నట్లు టెలికాం శాఖ పేర్కొన్నది. అక్టోబర్ 13వ తేదీన ఆ శాఖ కొత్త సర్క్యూలర్ జారీ చేసింది.
4జీతో పాటు హైయ్యర్ జనరేషన్ నెట్‌వర్క్స్‌లో టెలికాం ఆపరేటర్లు సీఎన్ఏపీ ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పింది. అయితే కచ్చితంగా 2026 నవంబర్ ఒకటో తేదీ నుంచి కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్‌ను ప్రవేశపెట్టాలని అన్ని టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు సర్క్యూలర్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. 2జీ, 3జీ టెక్నాలజీతో పాటు పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్‌వర్క్‌లకు సంబంధించిన సీఎన్ఏపీ గురించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకోనున్నట్లు టెలికం శాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

