హైదరాబాద్ : ప్రేమ, బాధ, సంతోషం ఇలా దేన్నైనా వ్యక్తపరచాలంటే కౌగిలికి మించిన ప్రత్యామ్నాయం లేదేమో. ఆలింగనంతోనే తమ సంపూర్ణ వ్యక్తీకరణను బహిర్గతపరుస్తుంటారు చాలావరకు. అది పొందేవారికి, పంచేవారికి చివరకు చూసేవారిని కూడా అనుభూతికి లోనుచేస్తుంది. ఇది కేవలం మనుషుల విషయంలో మాత్రమే అనుకుంటే పొరపడ్డట్లే. జంతువులకు కూడా కౌగిలింతలు అవసరం. ఇందుకు ఉదాహరణగా అన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారి సుశాంత నందా గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు.
సముద్ర వైవిధ్యం నుండి ప్రేమ కౌగిలిలో అంటూ క్యాప్షన్‌ను జోడించి వీడియోను పంచుకున్నారు. ఇందులో అండర్ వాటర్‌లో సముద్ర అందాలను చూసేందుకు వెళ్లిన స్కూబా డైవర్‌ను ఓ సీల్ మనిషి వలెనే కౌగిలించుకుంది. సీల్ అప్యాయతను ఆస్వాదించిన ఆ స్కూబా డైవర్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీల్‌ను ప్రేమగా నిమిరాడు. 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వందల్లో లైక్‌లు, షేర్లు, కామెంట్స్‌ను పంచుకున్నారు.
Love wrapped up within a hug💕
— Susanta Nanda IFS (@susantananda3) April 15, 2021
From ocean diversity pic.twitter.com/IdYYYvcqBN