గురుగ్రామ్, జూలై 13: హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25)ను తండ్రి దీపక్ యాదవ్ (49) కాల్చి చంపిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధికా యాదవ్ స్నేహితురాలు హిమాన్షికా సింగ్ రాజ్‌పుత్ ఇన్‌స్టాలో రాధిక, ఆమె కుటుంబ సభ్యుల గురించి పలు విషయాలను ఒక వీడియోలో వివరించారు.
‘ రాధిక సొంతంగా అకాడమీ స్థాపించే స్థాయికి ఎదిగింది. అయితే ఆమె అలా స్వతంత్రంగా నిలబడటాన్ని వారు సహించలేక పోయే వారు. షార్ట్స్ వేసుకున్నందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు వారు తీవ్రంగా అవమానించారు’ అని ఆమె పేర్కొంది. ఆమె మరణం వెనుక లవ్ జీహాదీ కోణం ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.