స్వాతంత్ర్య సమరయోధుడు.. 103 ఏళ్ల హెచ్ఎస్ దొరేస్వామి ఇకలేరు

బెంగుళూరు: స్వాతంత్య్ర సమరయోధుడు.. 103 ఏళ్ల వృద్ధుడు హెచ్ఎస్ దొరేస్వామి ఇవాళ కన్నుమూశారు. బెంగుళూరు హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. 103 ఏళ్ల దొరేస్వామి.. మే 13వ తేదీన కరోనా వైరస్‌ను జయించారు. భావ స్వేచ్ఛ కోసం పోరాడిన కన్నడ యోధుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. బెంగుళూరులోని జయదేవ్ హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. 1918, ఏప్రిల్ 10వ తేదీన బెంగుళూరులోని హరోహల్లిలో ఆయన జన్మించారు. యుక్తవయసులోనే ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తొలుత విప్లవ బాటలో సాగిన.. ఆ తర్వాత గాంధీ దారిలో నడిచారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన మైసూర్ సామ్రాజ్యంలో ఆందోళనలు నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1943 నుంచి 1944 మధ్య ఆయన 14 నెలల జైలు జీవితం అనుభవించారు. పౌరవాని అనే పత్రికను ఆయన నడిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

