Deve Gowda : శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బెంగళూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (90) ఆరోగ్యం మెరుగుపడింది. దేవెగౌడను ఆస్పత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వైద్యులు డిశ్చార్జి చేశారు.
దేవెగౌడ ధృడంగా ఉన్నారని, ఆయన శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని మణిపాల్ హాస్పిటల్ రెస్పిరేటరీ మెడిసిన్, ట్రాన్స్ఫ్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ సత్యనారాయణ మైసూర్ పేర్కొన్నారు.
శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ గురువారం ఉదయం జేడీఎస్ చీఫ్ దేవెగౌడ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ మైసూర్ పర్యవేక్షణలో వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందించడంతో పూర్తిగా కోలుకున్నారు.
Read More :
Athamma’s Kitchen | ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి భార్య సురేఖ