Karnataka Elections | బీజేపీకి వలసల షాక్.. ఎన్నికల వేళ కర్ణాటకలో గుడ్‌బై చెప్తున్న నేతలు
Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీలతో సహా పలువురు నేతలు ఆ పార్టీని వీడగా.. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది కూడా కమలం పార్టీకి ఝలక్ ఇచ్చారు.
Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీలతో సహా పలువురు నేతలు ఆ పార్టీని వీడగా.. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది కూడా కమలం పార్టీకి ఝలక్ ఇచ్చారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ లక్ష్మణ్ సవదికి బీజేపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు.
టికెట్ల నిరాకరణకు గురైన పలువురు నేతలు పార్టీని వీడటంపై ఇప్పటికే ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీని వీడే వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్‌లో చేరేముందు లక్ష్మణ్ సవది మీడియాతో మాట్లాడుతూ సర్దుకుపొయే రాజకీయాలు తనకు రావన్నారు. ‘బీజేపీతో ఇక చాలు. నేను చనిపోయిన తర్వాత కూడా నా మృతదేహాన్ని బీజేపీ ఆఫీస్ ముందుకు తీసుకోకూడదు’ అంటూ తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఎన్వై గోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు పుట్టన్న, బాబూరావు బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కాగా, లక్ష్మణ్ సవది బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు సన్నిహితుడు. యెడియూరప్పకు ప్రత్యామ్నాయ నేతగా లక్ష్మణ్‌ను సంతోష్ ప్రోత్సహించారనే చర్చ కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఉన్నది.
45 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు
బీజేపీ ఇప్పటికి రెండు విడతలుగా 212 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్ల నిరాకరణకు గురైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొన్నది. దాదాపు 35 నుంచి 45 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. నేతల మద్దతుదారులు పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. పార్టీ తరపున ప్రచారం చేయబోనని టికెట్ లభించని మంత్రి ఎస్ అంగార తేల్చిచెప్పారు. పలుచోట్ల వందలాది మంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామాలు చేస్తున్నారు. కొందరు శాసనసభ్యులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా మరి కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయాలనే యోచనలో ఉన్నారు. గూళిహట్టి శేఖర్(హోసదుర్గ) తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. కుమారస్వామి(మూడిగెరె) కూడా పార్టీకి దూరమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

