నోయిడా: ఢిల్లీలో జరిగిన రేవ్‌పార్టీ(Rave Party)లో సీజ్ చేసిన పాములను.. ఇవాళ అటవీశాఖ అధికారులు అడవిలో వదిలేశారు. పాములతో రేవ్‌పార్టీలు నిర్వహిస్తున్న యూట్యూబర్ ఎల్విశ్ యాదవ్‌ను ఇటీవల నోయిడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో అతన్ని నిన్న మూడు గంటల పాటు విచారించారు. అయిదు సర్పాల్లో ఒక పాముకు చెందిన విష గ్రంధులను తొలగించినట్లు మెడికల్ రిపోర్టు ద్వారా తేలింది. బిగ్‌బాష్ ఓటీటీ విన్నర్ యాదవ్.. ఈ కేసులో పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు.
యాదవ్ నిర్వహించే రేవ్ పార్టీలకు తాము విష పాములను సరఫరా చేయనున్నట్లు ఆ కేసులో దొరికిన మరో అయిదుగురు తెలిపారు. నాగు పాముకు చెందిన విషగ్రంధిని తొలగించినట్లు గుర్తించారు. పార్టీలో సీజ్ చేసిన పాములను కోర్టు అనుమతితో ఇవాళ అడవిలో వదిలేశారు. రేవ్‌పార్టీతో తనకు ఎటువంటి లింకు లేదని ఎల్విశ్ యాదవ్ తెలిపాడు.
#WATCH | Uttar Pradesh: Forest Department officials released snakes into the forest that were seized during a raid at a rave party in Noida. pic.twitter.com/hNqCRGcOIx
— ANI (@ANI) November 8, 2023