సరికొత్త ఫీచర్లతో ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్…

ఢిల్లీ, జూలై : ప్రముఖ కార్ల బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో కి సరికొత్త వెహికల ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయనున్నది. ప్రస్తుతం ఫోర్డ్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నది.
1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది ఫోర్డ్ ఇప్పటికే ఈ ఇంజన్‌ను తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో ఉపయోగిస్తున్నది. ఎకోస్పోర్ట్‌లోని ఈ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 96 బిహెచ్పి పవర్‌ను 119 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2015 సంవత్సరంలో భారత మార్కెట్లో ఫోర్డ్ ఫిగో ఎస్‌యూవీని తొలిసారిగా ప్రారంభించింది. ఆ సమయంలో ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో ఉండేది.

అప్పట్లో ఫోర్డ్ ఫిగోను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విక్రయిస్తున్న ఈ కారులో 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించేవారు. ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేశారు. ఇది గరిష్టంగా 110 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేసింది. కానీ ఫోర్డ్ ఇండియా 2019లో ఫిగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు, దాని స్థానంలో టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటుగా కంపెనీ మరింత శక్తివంతమైన 1.5-లీటర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది.
అయితే బిఎస్6 ఉద్గార నిబంధనలను అమలు చేయడం వల్ల, ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ తమ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను నిలిపివేసింది. ఇప్పుడు త్వరలోనే ఈ మోడల్ తిరిగి సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది. ఫోర్డ్ ఫిగో కొత్త పెట్రోల్-ఆటోమేటిక్ ఇంజిన్-గేర్‌బాక్స్ కలయిక దాని మిడ్-స్పెక్ టైటానియం ట్రిమ్‌లో అందించనున్నారు. అంతేకాదు గేర్‌బాక్స్‌ను హ్యాచ్‌బ్యాక్ టాప్-స్పెక్ వేరియంట్లో కూడా అందించే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- auto news
- automobile
- ford
- new car
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

