న్యూఢిల్లీ: విస్తారా(Vistara) విమానయాన సంస్థకు వరుసగా మూడో సారి ఇండియన్ బెస్ట్ ఎయిర్‌లైన్ అవార్డు లభించింది. స్కైట్రాక్స్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెంచర్‌తో నడుస్తున్న విస్తారా సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ విమాన సంస్థ ర్యాంకు నాలుగు స్థానాలు మెరుగుపడింది. దీంతో ప్రపంచ మేటి 20 ఎయిర్‌లైన్స్‌లో వరుసగా రెండో సారి విస్తారా చోటు సంపాదించింది.
బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా అవార్డును విస్తారా వరుసగా మూడోసారి గెలుచుకోవడం విశేషం. బెస్ట్ క్యాబిన్ సిబ్బంది, బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్‌లైన్ అవార్డులను కూడా రెండోసారి విస్తారా సంస్థ సొంతం చేసుకున్నది. పారిస్ ఎయిర్ షో 2023 సమయంలో అవార్డులను ప్రకటించారు. ఏషియాలో బెస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో విస్తారాకు 8వ ర్యాంక్ వచ్చింది.