FM Nirmala Sitaraman | భారత ఆర్థికవ్యవస్థ సంతృప్తికరంగానే ఉంది.. అయితే.. : నిర్మలా సీతారామన్
FM Nirmala Sitaraman | భారత ఆర్థికవ్యవస్థ (Indian Economy) పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అయితే ఈ వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) అన్నారు. దీర్ఘకాలికంగా వృద్ధిని కొనసాగించాలంటే నిరంతర ఆవిష్కరణలు, సంస్కరణలు, వ్యవస్థల బలోపేతం చాలా అవసరమని ఆమె స్పష్టంచేశారు.
FM Nirmala Sitaraman : భారత ఆర్థికవ్యవస్థ (Indian Economy) పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అయితే ఈ వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) అన్నారు. దీర్ఘకాలికంగా వృద్ధిని కొనసాగించాలంటే నిరంతర ఆవిష్కరణలు, సంస్కరణలు, వ్యవస్థల బలోపేతం చాలా అవసరమని ఆమె స్పష్టంచేశారు. ఇవాళ జరిగిన ‘మైండ్‌మైన్ సమ్మిట్ 2026’ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘మన దేశం ఆర్థికంగా బాగానే రాణిస్తోందని నాకు తెలుసు. కానీ మన పనితీరును మనం నిరంతరం జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ఇంకా ఎక్కడ మెరుగుపరుచుకోవాలో గుర్తించాలి’ అని అన్నారు.
కేవలం ఆర్థికవృద్ధి మాత్రమే సరిపోదని, స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధి కోసం బలమైన సంస్థలు, సమర్థవంతమైన విధానాలు, పటిష్ఠమైన మద్దతు వ్యవస్థలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్ వంటి పెద్ద, సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని నిలబెట్టుకోవాలంటే సామర్థ్యాలను బలోపేతం చేయడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూడటం కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె సూచించారు. పురోగతి దానంతట అదే వస్తుందని భావించకూడదని, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి నిరంతర కృషి, ఆవిష్కరణలు, సంస్కరణలు తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.
అనేక రంగాలు బలంగా రాణిస్తున్నప్పటికీ, ముఖ్యంగా సంక్లిష్టమైన, మధ్యంతర ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన కొన్ని రంగాలకు విధానపరమైన మద్దతు ఇంకా అవసరమని ఆమె అంగీకరించారు. దీర్ఘకాలంగా ఉన్న సవాళ్లను నిర్మాణాత్మక సంస్కరణలు, మెరుగైన అమలు లేదా కొత్త విధానాల ద్వారా ఎలా పరిష్కరించవచ్చో విధానకర్తలు నిరంతరం పరిశీలించాలని అన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంపై కేంద్రమంత్రి కీలక హెచ్చరిక చేశారు. దీని కారణంగా రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని, ప్రభుత్వం అందుకు సిద్ధమవుతోందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

