IndiGo | విమానంలో తప్పతాగి వికృత చేష్టలు.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
IndiGo | విమాన ప్రయాణంలో (Air travel) తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు.. ఒకటితర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి తరహా ఘటనే మరొకటి చోటు చేసుకుంది. బుధవారం దుబాయ్ (Dubai) నుంచి ముంబై (Mumbai)కి వస్తున్న ఇండిగో (IndiGo) విమానంలో ఇద్దరు ప్రయాణికులు తప్పతాగి తోటి ప్రయాణికులను దుర్భాషలాడారు.
IndiGo | విమాన ప్రయాణంలో (Air travel) తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు.. ఒకటి
తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన
ఎయిరిండియా (Air India) బిజినెస్ క్లాస్‌లో ఓ మహిళపై మద్యం (liquor) మత్తులో మూత్ర విసర్జన చేసిన
విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు విమానాల్లో ఇలాంటి ఘటనలు
వరుసగా చోటు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటి తరహా ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
బుధవారం దుబాయ్ (Dubai) నుంచి ముంబై (Mumbai)కి వస్తున్న ఇండిగో (IndiGo) విమానంలో ఇద్దరు ప్రయాణికులు తప్పతాగి తోటి ప్రయాణికులను దుర్భాషలాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ (Palghar ), కొల్హాపూర్ (Kolhapur) ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఏడాదిపాటు గల్ఫ్ (Gulf)లో పనిచేసి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గల్ఫ్‌లో బయలుదేరే ముందు వారు అక్కడి డ్యూటీ ఫ్రీ షాపు (duty-free shop) లో మద్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ఆ తర్వాత విమానంలోనే మద్యం సేవించడం ప్రారంభించారు. దీనిపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. వారిపై దుర్భాషలాడారు. నిందితుల్లో ఒకరు బాటిల్ చేతిలో పట్టుకుని విమానంలో నిర్లక్ష్యంగా నడుస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. దీంతో.. విమానంలోని సిబ్బంది అతడి చేతిలోని మద్యం బాటిల్‌ను బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది.
విమానం ముంబైలో లాండ్ అయిన అనంతరం ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు
తెలిపారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినందుకు గానూ ఇండియన్ పీనల్ కోడ్ 336
(ఇతరుల ప్రాణాలకు, భద్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు)తో పాటూ ఎయిర్ క్రాప్ట్ రూల్స్‌లోని
21, 22, 25 నిబంధనల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Amritpal Singh | అమృత్‌పాల్ సింగ్ భార్యను విచారించిన పోలీసులు
India Corona | మరోసారి కోరలు చాస్తున్న మహమ్మారి.. దేశంలో 140 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

