Amritpal Singh | అమృత్‌పాల్ సింగ్ భార్యను విచారించిన పోలీసులు
Amritpal Singh | ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Amritpal Singh | ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా పంజాబ్ పోలీసు (Punjab Police)లు అతని కోసం వేట కొనసాగిస్తున్నారు. పోలీసులు కన్నుగప్పి పరారీలో ఉన్న ఆ వేర్పాటువాద నేత మారువేషాల్లో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
బుధవారం అమృత్‌పాల్ స్వగ్రామమైన జల్లుపూర్ ఖేరా (Jallupur Khera)కు వెళ్లిన పోలీసులు ఆయన తల్లిదండ్రులు, భార్యను విచారించారు. అమృత్‌పాల్ (Amritpal Singh) భార్య కిరణ్‌దీప్ కౌర్ (Kirandeep Kaur), అమృత్‌పాల్ తండ్రి తార్సెమ్ సింగ్, తల్లిని మహిళా పోలీసు అధికారులు దాదాపు గంటపాటు విచారించారు. అమృత్‌పాల్ కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై కిరణ్‌దీప్‌కౌర్ (Kirandeep Kaur)ను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.
ఎవరీ కిరణ్‌దీప్ కౌర్..?
కిరణ్‌దీప్‌కౌర్ (Kirandeep Kaur) యూకేకు చెందిన ఎన్నారై ( UK-based NRI). మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమృత్‌పాల్ ఆమెను వివాహం చేసుకున్నాడు. తన భార్య తనతో ఉండేందుకు పంజాబ్ వచ్చేస్తుందని కూడా వివాహానంతరం అమృత్‌పాల్ ప్రకటించారు. ఆ తర్వాత పంజాబ్ చేరుకున్న కిరణ్‌దీప్‌కౌర్ అమృత్‌పాల్ పూర్వీకుల గ్రామమైన జల్లుపూర్ ఖేరా (Jallupur Khera)లో నివసిస్తోంది. కిరణ్‌దీప్‌కౌర్ పూర్వీకులు కూడా జలంధర్ (Jalandhar)లో ఉండేవారని సమాచారం. నటుడు-కార్యకర్త అయిన దీప్ సిద్ధు (Deep Sidhu) స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’ (Waris Punjab De) సంస్థ చీఫ్‌గా అమృత్‌పాల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే కిరణ్‌తో అమృత్‌పాల్ వివాహం జరిగింది.
గత శనివారం నుంచి అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు(Punjab police) గాలిస్తున్న విషయం తెలిసిందే. మారువేషాల్లో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతనితో లింకు ఉన్న మద్దతుదారుల్ని కొందర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. వార్సీ పంజాబ్ దే కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొందర్ని అస్సాంలోని దిబ్రుఘర్‌లో ఉన్న జైలుకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

