సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 01:24:05

త్వరలో విమాన సిబ్బందికి డ్రగ్స్‌ పరీక్షలు

త్వరలో విమాన సిబ్బందికి డ్రగ్స్‌ పరీక్షలు

న్యూఢిల్లీ: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ మాదిరిగా విమాన సిబ్బందికి డ్రగ్స్‌ సంబంధ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయించింది. నిబంధనలను తర్వలో ఖరారు చేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. పైలట్లు, ఎయిర్‌ హోస్టులు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌(ఏటీసీ)కు తొలిదశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో లేదా ఏటీసీ కాంప్లెక్స్‌లలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. మూత్ర నమూనాల్లో మత్తుపదార్థాల ఆనవాళ్లను పరీక్షిస్తారు. ఇందులో పాజిటివ్‌ అని తేలినవారికి ల్యాబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ కూడా పాజిటివ్‌గా వస్తే పునరావాస కేంద్రాలకు పంపుతారు. కోలుకున్న తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించి, వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాతే క్రీయాశీలక విధుల్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడితే లైసెన్స్‌ను రద్దు చేస్తారు.


logo