బనస్కాంత: గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. థారాడ్-ధనేరా రహదారిపై కారు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా, ఘటన జరిగిన వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసత్రికి తరలించి, మృతదేహాలకు పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.